లగడపాటి చెప్పిన బ్రహ్మాస్త్రం ఏమిటో తెలుసా?
రాష్ట్ర విభజన కి కాంగ్రెస్ మొగ్గు చూపితే ఒక బ్రహ్మాస్త్రం సిద్దం గా
ఉన్నదని లగడపాటి చెప్పినప్పుడు అందరూ అనుకున్నది కిరణ్ రాజీనామానే
బ్రహ్మాస్త్రం అని. అందుకే మీడియా అంతా సీమాంధ్ర బాట్స్ మెన్ ఓపెనర్ గా
బరిలోకి దిగాడని రాజీనామా బంతిని అధిష్టానం కూర్చున్న స్టాండ్స్ లోకి
కొడతాడని ప్రచారం చేశారు. బంతి దెబ్బకి హర్ట్ అయిన బాట్స్ మెన్ లా పరుగున
వచ్చి నేనలాంటోడిని కాదని
ప్రకటించుకున్నారు కిరణ్. అందరూ అక్కడితో ఆ విషయం మరిచి పోయారు. అసలు
నిజం వేరు. విశ్వసనీయ సమాచారం మాకు అందిన దానిని బట్టీ ఖచ్చితమైన
వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు బ్రహ్మాస్త్రం పేరు వై సీ పీ. తెలంగాణ
ఇస్తే కాంగ్రెస్ లో పుట్టగతులు ఉండవు. సీమాంధ్ర లో తుడిచి పెట్టుకు పోవటం
ఖాయం. భవిష్యత్తులో కూడా ఓటు వేసే అలవాటు అక్కడ ఉండదు. కాంగ్రెస్ మీద ఎన్
టీ ఆర్ ని దెబ్బ తీసిన హయాంలో వచ్చిన వ్యతిరేకత కారణంగా తెలుగు దేశాన్ని
ప్రత్యర్ధిగా నిలబెట్టిన సీమాంధ్రలో ఒక్క సారి మైండ్ లో పడితే మరో యు పీ
ఖాయమని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ బ్రహ్మాస్త్రం గా వై సీ పీ లోకి
మూకుమ్మడిగా మంత్రులు, ఎల్ ఎల్ ఏ లు, ఏం పీలు కలిసి వెళ్ళి పోతారు.
తెలంగాణ లో ఎలాగూ పెద్దగా బలం లేని జగన్ సమైఖ్య వాదంతో రోడ్ ఎక్కుతారు.
జగన్ ని బయ్తకి రానీయక పోయినా వై ఎస్ ఆశయం అయిన సమైఖ్య ఆంధ్ర ని విడదీసిన
కాంగ్రెస్ ని వదులుతున్నామని ప్రకటించి లగడపాటి టో సహా అందరూ వై సీ పీ
తీర్ధం పుచ్చుకుంటారు. తెలుగు దేశం వల్లే తెలంగాణ అడ్డుకోలేకపోయామని
కాంగ్రెస్ అధిష్టానాన్ని చివరి దాకా ఆపే ప్రయత్నం చేసి గత్యంతరం లేని దశలో
పార్టీని, పదవులని వదిలామని చెప్పి అందరూ రాజీనామాలు చేసి వై సీ పీ లో చేరే
విధంగా ఇప్పటికే చర్చలు జరిగి పోయాయి. కేవలం ఈనెల లో సీ డబ్ల్యూ సీ
నిర్ణయం అది అయితే ఆ పైన ఈ బ్రహ్మస్త్రమె వాడతారు. మరి వై సీ పీ ని
ఎన్నికల తర్వాత తమతో కలుపుకునే పాశుపతాస్త్రం అధిష్టానం ప్రయోగిస్తే అని
అడిగితే మాత్రం మా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం వాడాలనుకునే
నేతలకి దానికంటే పవర్ఫుల్ పాశుపతాస్త్రం గురించి తెలియాలి కదా ?
No comments:
Post a Comment