Friday, July 26, 2013

What is the Trump Card for Lagadapati and co ?

లగడపాటి చెప్పిన బ్రహ్మాస్త్రం ఏమిటో తెలుసా?
రాష్ట్ర విభజన కి కాంగ్రెస్ మొగ్గు చూపితే ఒక బ్రహ్మాస్త్రం సిద్దం గా ఉన్నదని లగడపాటి చెప్పినప్పుడు అందరూ అనుకున్నది కిరణ్ రాజీనామానే బ్రహ్మాస్త్రం అని. అందుకే మీడియా అంతా సీమాంధ్ర బాట్స్ మెన్ ఓపెనర్ గా బరిలోకి దిగాడని రాజీనామా బంతిని అధిష్టానం కూర్చున్న స్టాండ్స్ లోకి కొడతాడని ప్రచారం చేశారు. బంతి దెబ్బకి హర్ట్ అయిన బాట్స్ మెన్ లా పరుగున వచ్చి నేనలాంటోడ
ిని కాదని ప్రకటించుకున్నారు కిరణ్. అందరూ అక్కడితో ఆ విషయం మరిచి పోయారు. అసలు నిజం వేరు. విశ్వసనీయ సమాచారం మాకు అందిన దానిని బట్టీ ఖచ్చితమైన వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు బ్రహ్మాస్త్రం పేరు వై సీ పీ. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో పుట్టగతులు ఉండవు. సీమాంధ్ర లో తుడిచి పెట్టుకు పోవటం ఖాయం. భవిష్యత్తులో కూడా ఓటు వేసే అలవాటు అక్కడ ఉండదు. కాంగ్రెస్ మీద ఎన్ టీ ఆర్ ని దెబ్బ తీసిన హయాంలో వచ్చిన వ్యతిరేకత కారణంగా తెలుగు దేశాన్ని ప్రత్యర్ధిగా నిలబెట్టిన సీమాంధ్రలో ఒక్క సారి మైండ్ లో పడితే మరో యు పీ ఖాయమని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ బ్రహ్మాస్త్రం గా వై సీ పీ లోకి మూకుమ్మడిగా మంత్రులు, ఎల్ ఎల్ ఏ లు, ఏం పీలు కలిసి వెళ్ళి పోతారు. తెలంగాణ లో ఎలాగూ పెద్దగా బలం లేని జగన్ సమైఖ్య వాదంతో రోడ్ ఎక్కుతారు. జగన్ ని బయ్తకి రానీయక పోయినా వై ఎస్ ఆశయం అయిన సమైఖ్య ఆంధ్ర ని విడదీసిన కాంగ్రెస్ ని వదులుతున్నామని ప్రకటించి లగడపాటి టో సహా అందరూ వై సీ పీ తీర్ధం పుచ్చుకుంటారు. తెలుగు దేశం వల్లే తెలంగాణ అడ్డుకోలేకపోయామని కాంగ్రెస్ అధిష్టానాన్ని చివరి దాకా ఆపే ప్రయత్నం చేసి గత్యంతరం లేని దశలో పార్టీని, పదవులని వదిలామని చెప్పి అందరూ రాజీనామాలు చేసి వై సీ పీ లో చేరే విధంగా ఇప్పటికే చర్చలు జరిగి పోయాయి. కేవలం ఈనెల లో సీ డబ్ల్యూ సీ నిర్ణయం అది అయితే ఆ పైన ఈ బ్రహ్మస్త్రమె వాడతారు. మరి వై సీ పీ ని ఎన్నికల తర్వాత తమతో కలుపుకునే పాశుపతాస్త్రం అధిష్టానం ప్రయోగిస్తే అని అడిగితే మాత్రం మా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం వాడాలనుకునే నేతలకి దానికంటే పవర్ఫుల్ పాశుపతాస్త్రం గురించి తెలియాలి కదా ?

Konda Sureskha & her series of Sacrifices !

కొండా సురేఖ మరోసారి త్యాగం
అడవిలో ఉన్నప్పుడు కుటుంబాన్ని త్యాగం చేసింది. తుపాకి వదిలేశాక మావోల ఉద్యమాన్ని త్యాగం చేసింది. రాజన్న కొడుకు కోసం మొదట పెట్టుబడి రూపంలో సొమ్ము త్యాగం చేసింది. ఆ తర్వాత మంత్రి పదవిని త్యాగం చేసింది. చిరాకెసి పార్టీ ని త్యాగం చేసింది. ఆమె సేవలు గుర్తించిన విజయమ్మ ఇచ్చిన బహుమానం నియోజక వర్గం కి పరిమితం కావటంతో స్ధాయిని త్యాగం చేసింది. లేటెస్ట్ గా తెలంగాణ అంశాన్ని త్యాగం చేసింది. అదీ కొండా సురేఖ స్పెషల్.

Decision on Telangana is allegedly over

ఆశలు వదిలేశారు
తెలంగాణ అంశం మీద నిర్ణయం అయిపోయింది. ఈ డిసెంబర్ నాటికి విభజన అనివార్యం. అసెంబ్లి సమావేశం, సీమాంధ్ర అంశాల మీద దృష్టి పెట్టండి. అని వార్ రూమ్ లోకి పిలిచి మరీ కాంగ్రెస్ పెద్దలు సీ ఏం కి, బొత్స కి చెప్పేశారు. దీనితో కనీసం సెప్టెంబర్ వరకు ఆపండి. స్ధానిక ఎన్నికలు అయిపోయాక చేస్తే బెటర్ అని కిరణ్ కోరారు. అది తమ చేతిలో లేదని చెప్పటంతో ఆదే మాట సీమాంధ్ర ప్రజాప్రతినిధులకి కిరణ్ చెప్పేశారు. దీనితో సమావేశం మద్యలో నుండి ఉండవల్లి, శీలం, పల్లం రాజు లేచి వెళ్ళిపోయారు. రాజీనామాలు చేసేది లేదని మంత్రులు కూడా చెప్పేశారు. మొత్తం మీద అందరూ ఆశలు వదిలేసుకున్నారన్నది సమాచారం.

Accept Formation of Telangana , Dear Seema Andhra People


" నాటకాలు బంధ్ చేయండి "
తెలంగాణ పేరిట రాష్ట్రం విడదీయటం ద్వారా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం దేనికైనా తెగిస్తోందని ఈరోజు చెబుతున్న నేతలరా ఆదే రాజకీయ ప్రయోజనం కోసం నాడు వై ఎస్ --  చిన్న రెడ్డి ని డిల్లీ కి 47 మంది టీ ఏం ఎల్ ఏ లతో తీర్మానం పంపించింది స్వార్ధంతో, రాజకీయ అధికార దాహంతో కాదా?
@తెలంగాణ విషయంలో రేపటికి మీరు బిల్లు పెట్టండి లేదా నన్ను పెట్టమంటారా? అనిస్ ఆవాల్ చేసి తొడ చరిచిన బాబు స్వార్ధ రాజకీయం కోసం కాదా ఆ రోజున మాట్లాడింది. ఆ తర్వాత ఇచ్చాక మాట మార్చింది.
@పార్లమెంట్ లో ప్లే కార్డ్ పట్టుకుని సమైఖ్య వాదం వినిపించిన జగన్ పార్టీ పెట్టాక ప్లీనరీ లో ఆదే రాజకీయ స్వార్ధంతో కాదా తెలంగాణ మనోభావాలకి గౌరవిస్తూ కట్టుబడి ఉన్నామని చెప్పింది. అఖిలా పక్షం రోజున ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయం తీసుకోమని చెప్పింది ఆదే రాజకీయ స్వార్ధంతో కాదా? ఈవేళ విభజన వద్దంటూ ఆదే రాజకీయ స్వార్ధంతో కాదా? ప్రకటనలు చేస్తోంది.
@మన నేత అధికారంలోకి రావటానికి తెలంగాణ అంశం వాడుకుంటున్న ప్రతి సారి ఏమీ ఇవ్వరులే అని సారి పుచ్చుకుని సీమాంధ్ర నేతల తప్పులకి మద్దతుగా ఓట్లు వేసినప్పుడు అది రాజకీయంగా స్వార్ధ ఆలోచన కాదా?
ఇక్కడ అందరూ రాజకీయ స్వార్ధంతో వ్యవహరించిన వారే. తమకి ఏ ప్రయోజనం లేక పోయినా తమ నేతలు గెలవాలన్న కాంక్షతో పార్టీల రాజకీయ జూదానికి సహకరించిన సీమాంధ్ర ప్రజలు పైసా సంపాదించకపోయినా మనశ్శాంతిని కోల్పోయారు. తమ వారి పరిస్ధితి ఏంటో ఆలోచించుకుంటూ ఇప్పుడు మరింత అంధోళన చెందుతున్నారు. ఒక్కటే ఆలోచించుకోవాలి. రేపు రాష్ట్రం ఇచ్చాక ఇక్కడ రాష్ట్ర ఏర్పాటు కి ప్రతి పదిక ఉద్యోగాలు అన్నీ మాకే రావాలి అని. ఇక్కడ రాష్ట్ర పభూత్వా ఉద్యోగాలలో సీమాంధ్రులకి అని ఎవరు రీజర్వేషన్ ఇవ్వరు. కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత కూడా హక్కులు లేని రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాలలో కొనసాగాలా? లేదా పదే పదే మా ఉద్యోగాలు దోపిడీ చేశారు, మమ్మల్ని అవమానించారు అంటున్న వారితో ఉండాలో ఆలోచించుకోవటం అవసరం. ఇప్పుడు పక్వానికి వచ్చిన అంశంలో మరొకసారి సర్ది బుచ్చి ఇక్కడే ఉండాలా? మళ్ళీ ఇక్కడే అన్నీ సంస్ధలని తెచ్చి పెట్టి, ఇక్కడే అన్నీ కట్టించి అవన్నీ దోచుకునే వారీగా దూషణలు అనుభవించాలా/ లేక విడిపోయి అక్కడ అభివృద్ధి ఇప్పటికైనా స్టార్ట్ చేసుకోవాలా? అన్నది ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నం అయ్యింది. వ్యక్తులుగా తిట్టుకోవటం, మా భావన మీరు అంగీకరించటం లేదని దూషించుకోవటం అనవసరం.

Monday, July 22, 2013

From Telugu Media Nijaalu ! - Recruit as journalist, ppl with Min GK

వార్తలు తెలిసిన వాళ్ళని చూడండి
న్యూస్ అంటే ఏమిటో తెలియని వాళ్ళని, మొఖం అందంగా ఉందనో, ఇంగ్లిష్ వచ్చనో, పోష్ గా కనిపిస్తారనో రిపోర్టర్ లుగా రెక్రూట్ చేసుకోవటం వాళ్ళకి కవరేజ్ కూడా రాణి దౌర్భాగ్యం మీడియా కి పట్టిన దరిద్రం. నూటికి 95 మంది వార్త అంటే కేవలం కెమెరా మెన్ ని వెంట పెట్టుకుని చెప్పిన ప్రోగ్రాం కవర్ చేయటమే అనే భావ దారిద్ర్యంలో ఉన్నారు. ఒక విషయం ప్రజలకి ఏ మేరకు పనికి వస్తుంది? అందులో అవసరం అయిన కంటెంట్ ఏమిటి? రాజకీయ నేత మాటల్లో జనానికి అవసరం అయిన అంశం ఏమిటి? సోల్లి కబుర్లు ఎమున్నాయి అన్నది ఫిల్టర్ చేయగలగాలి. సమస్య ని టేక్ అప్ చేస్తే అది ఎందుకు? ఎలా? ఎప్పుడు? ఎక్కడ?పుట్టింది అన్నది కనిబెట్టాలి. ఆ తర్వాత దాని పరిష్కారం ఎలా? పరిష్కరించటానికి అడ్డు పడుతున్నది ఎవరు అన్నది పట్టుకుని టార్గెట్ చేసి కొడితే ధీమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి పరిష్కారం పరిగెత్తుకు వస్తుంది. మైండ్ బ్లాంక్ రిపోర్టర్ లు పోర్టర్ ల లా తయారు అయ్యారు. వార్తల కోసం వెళ్ళి అవతలి వాడు చెప్పిన దాన్ని రాసుకు వచ్చే ఈ భాపాటు వాళ్ళని పక్కన్ పెట్టి ఎంపిక చేయటం లేదా, తయారు చేయటం అనే కాన్సెప్ట్ నడపాల్సిన చానల్స్ లోని ఇన్పుట్, ఔట్ పుట్ ఎడిటర్లు యజమాన్యం పనులు చేయించి పెట్టే బ్రోకర్ పనులకి సారి పోతున్నారు. అలాంటి వాళ్ళు నిజమైన పాత్రికేయులు తయారు అయితే తమ చేతకాని తనం ఎక్కడ తెలిసి పోతుందో అన్న ఫీలింగ్ తో మంచి కాడర్ ని తయారు చేయటం మీద దృష్టి పెట్టటం లేదు. కొన్ని సంస్ధలలో మంచి ఇన్ పుట్, ఔట్ పుట్ లు హెడ్ లు ఉంటే యజమాన్యానికి న్యూస్ కంటే వ్యూ కావాలి. ఇలాంటి స్ధితిలో మీడియా బాగుపడాలన్న ఫీలింగ్, జనం ముందుకు దూకుడుగా సమస్యల పైన వెళ్లాలన్న తపన అవసరం. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయక పోతే రానున్న రోజుల్లో రాజకీయ నేతల తాబేదార్ల జాబితాలో మీ పేరు ఉందో చూసుకునే దౌర్భాగ్య స్ధితికి చేరతారు. బీ ఎలెర్ట్ ఫ్రెండ్స్.

Hyderabad is floating in rain !

"Perception starts from the external environment and then, goes deep into internal ' said Jiddu Krishnamurti . I thought I need to take a ' capture' or 'snapshot 'of the world, as it goes on. A still photo graph, in the running motion of life. Hence this blog. 

First, about RAIN ! In Hyderabad, it's  been raining continuously, incessantly, for the past 17 days. Since 3.July.2013, or round abouts. Elderly people are commenting, that they have never seen this kind of rain in the last 40 years in Hyderabad ! Good ! While the rains were not torrential , it's been a small rain and continuous drizzle which kept the climate wet, cool but body temps up, due to viral and seasonal fevers. All hospitals are full. 

All water reservoirs, like Osman Sagar, Hussain Sagar, Manjeera and Krishna and Godavari are FULL this year. Hope this does not exceed the limit  and allows ' khareef 'agriculture smoothly now. 
Hyd now has nearly 1 crore population. To quench the thirst of 1 Cr people for 1 year, this much rain is needed ! 
Thank God for little mercies !