From Telugu Media Nijaalu ! - Recruit as journalist, ppl with Min GK
వార్తలు తెలిసిన వాళ్ళని చూడండి
న్యూస్ అంటే ఏమిటో తెలియని వాళ్ళని, మొఖం అందంగా ఉందనో, ఇంగ్లిష్ వచ్చనో,
పోష్ గా కనిపిస్తారనో రిపోర్టర్ లుగా రెక్రూట్ చేసుకోవటం వాళ్ళకి కవరేజ్
కూడా రాణి దౌర్భాగ్యం మీడియా కి పట్టిన దరిద్రం. నూటికి 95 మంది వార్త అంటే
కేవలం కెమెరా మెన్ ని వెంట పెట్టుకుని చెప్పిన ప్రోగ్రాం కవర్ చేయటమే అనే
భావ దారిద్ర్యంలో ఉన్నారు. ఒక విషయం ప్రజలకి ఏ మేరకు పనికి వస్తుంది?
అందులో అవసరం అయిన కంటెంట్ ఏమిటి? రాజకీయ నేత మాటల్లో జనానికి అవసరం అయిన
అంశం ఏమిటి? సోల్లి కబుర్లు ఎమున్నాయి అన్నది ఫిల్టర్ చేయగలగాలి. సమస్య ని
టేక్ అప్ చేస్తే అది ఎందుకు? ఎలా? ఎప్పుడు? ఎక్కడ?పుట్టింది అన్నది
కనిబెట్టాలి. ఆ తర్వాత దాని పరిష్కారం ఎలా? పరిష్కరించటానికి అడ్డు
పడుతున్నది ఎవరు అన్నది పట్టుకుని టార్గెట్ చేసి కొడితే ధీమ్మ తిరిగి మైండ్
బ్లాంక్ అయ్యి పరిష్కారం పరిగెత్తుకు వస్తుంది. మైండ్ బ్లాంక్ రిపోర్టర్
లు పోర్టర్ ల లా తయారు అయ్యారు. వార్తల కోసం వెళ్ళి అవతలి వాడు చెప్పిన
దాన్ని రాసుకు వచ్చే ఈ భాపాటు వాళ్ళని పక్కన్ పెట్టి ఎంపిక చేయటం లేదా,
తయారు చేయటం అనే కాన్సెప్ట్ నడపాల్సిన చానల్స్ లోని ఇన్పుట్, ఔట్ పుట్
ఎడిటర్లు యజమాన్యం పనులు చేయించి పెట్టే బ్రోకర్ పనులకి సారి పోతున్నారు.
అలాంటి వాళ్ళు నిజమైన పాత్రికేయులు తయారు అయితే తమ చేతకాని తనం ఎక్కడ
తెలిసి పోతుందో అన్న ఫీలింగ్ తో మంచి కాడర్ ని తయారు చేయటం మీద దృష్టి
పెట్టటం లేదు. కొన్ని సంస్ధలలో మంచి ఇన్ పుట్, ఔట్ పుట్ లు హెడ్ లు ఉంటే
యజమాన్యానికి న్యూస్ కంటే వ్యూ కావాలి. ఇలాంటి స్ధితిలో మీడియా బాగుపడాలన్న
ఫీలింగ్, జనం ముందుకు దూకుడుగా సమస్యల పైన వెళ్లాలన్న తపన అవసరం.
ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయక పోతే రానున్న రోజుల్లో రాజకీయ నేతల తాబేదార్ల
జాబితాలో మీ పేరు ఉందో చూసుకునే దౌర్భాగ్య స్ధితికి చేరతారు. బీ ఎలెర్ట్
ఫ్రెండ్స్.
No comments:
Post a Comment